6వ రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభోత్సవం.

ప్రారంభించిన ఎమ్మెల్యే అజ్మీర రేఖా శ్యాం నాయక్.

ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి.

జనం సాక్షి ఉట్నూర్.

తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల 6వ రాష్ట్రస్థాయి ఆటల పోటీలను శనివారం ఉట్నూర్ మండలంలోని లాల్ టెక్డి గురుకుల పాఠశాలలో స్థానిక ఎమ్మెల్యే అజ్మీర రేఖా శ్యామ్ నాయక్ ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి తో కలిసి ప్రారంభించడం జరిగింది. ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలకు మంచి ప్రాధాన్యత కల్పించే పేద గిరిజన విద్యార్థులకు విద్యాబోధన వసతి గృహము అందిస్తున్నారని దేశంలో తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల పాఠశాల విద్యార్థులు మంచి ప్రతిభ కనబరుస్తున్నారని క్రీడలు ఆడుతున్న విద్యార్థులందరికీ తన వంతుగా ఒక్క లక్ష రూపాయల షూస్ కొనిస్తారని హామీ ఇచ్చారు.

ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వరుణ్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు క్రీడల్లో రాణించి మంచి ఉన్నత స్థానాలకు ఎదగాలని విద్యార్థులకు ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఈడి శ్రీనివాస్ ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ శ్రీరామ్ పవార్ జగదీష్ అధికారులు ప్రజాప్రతినిధులు ఉన్నారు.