గోదావరి వరద ఉద్ధృతి కారంగా నిలిచిపోయిన రాకపోకలు

వెంకటాపురం(ఖమ్మం): గోదావరి వరద ఉద్ధృతి కారణంగా వెంకటాపురం-చర్ల ప్రధాన రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. గోదాపురం సమీపంలోని జిన్నెలవాగు వారధి, వీరభధ్రవరం సమీపంలోని కుక్కతొర్రి వాగు వారధి, పాత్రాపురం టేకులబోరు మధ్యలోని రహదారి వారధి ముంపునకు గురయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి ఈ పరిస్థితి నెలకొన్నా రెవిన్యూ అధికారులు ప్రయాణికులు అవస్థలపై స్పందించడంలేదు. .