కాంగ్రెస్‌ వర్గీయులపై తెదేపా కార్యకర్తల దాడి

పొందూరు: శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం పిల్లలవలస గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారి ఇళ్లపై తెదేపాకు చెందిన వారు రాళ్లతో దాడి చేశారు. ఇంట్లో సామాగ్రిని లూటీ చేసి, గురుగువల్లి ప్రసాద్‌రావు, పైడి బాల, కూన కృష్ణవేణి, జి. వెంకట్రావు, చెవిటన్న, కె. యోగి, అప్పలనాయుడులపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. బాధితులను శ్రీకాకుళం రిమ్స్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కృష్ణవేణి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.