ప్రారంభంకానున్న మహంకాళి బోనాల ఉత్సవాలు

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల ఉత్సవాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు చేయాలని ఉత్సవ కమిటీ నాయకుడు, తెదేపా నేత తలసాని శ్రీనివాస యాదవ్‌ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మను కలిశారు. బోనాల సందర్భంగా వూరేగింపులు ఉండటంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు కల్పించాలని వారు సీపీకి వినతి పత్రం సమర్పించారు. దీంతో పాటు మహకాంళి ఆలయానికి పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సీపీని కోరారు.