రెండో విడత పంచాయతీ పోలింగ్‌ ప్రారంభం

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర వాప్తంగా 6,971 పంచాయతీలకు ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లను లెక్కించనున్నారు. మొదట వార్డ్‌ మెంబర్లు తర్వాత సర్పంచ్‌ల ఓట్ల లెక్కింపు జరుగును. 1,910 సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌ కెమెరాలు, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా  పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.