పాక్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన
పూంఛ్,(జనంసాక్షి): జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వద్ద పాకిస్థాన్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘించి కాల్పులు జరుపుతున్నట్లు సమాచారం. ఈ రోజు ఉదయం ఏడున్నర గంటలనుంచి సరిహద్దులోని రెండు భారతీయ సైనిక శిబిరాలపై పాకిస్థాన్ సైన్యం కాల్పులు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.