రేపు హస్తిన వెళ్లనున్న సీఎం కిరణ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఉదయం హస్తిన వెళ్లనున్నారు. ఢిల్లీ రావాలని ప్రధాని కార్యాలయం నుంచి సీఎం కిరణ్‌కు ఫోన్‌ వచ్చింది. తెలంగాణపై యూపీఏ సమన్వయ కమిటీ, సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో అధిష్ఠానానికి అందుబాటులో ఉండాలని సీఎం కిరణ్‌ ప్రధాని కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.