బిల్లు పెట్టిన తర్వాతే సంబరాలు : కేటీఆర్
హైదరాబాద్ : తెలంగాణపై పార్లమెంట్‌లో బిల్లు పెట్టిన తర్వాతే సంబరాలు చేసుకుంటామని సిరిసిల్ల ఎమ్మెల్యే కె. తారకరామరావు అన్నారు. యూపీఏ తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో కూడిన 10 జిల్లాల తెలంగాణ కావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.