మాజీ మంత్రి పీవీ రంగారావు మృతి
హైదరాబాద్,(జనంసాక్షి): మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమారుడు మాజీ మంత్రి పీవీ రంగారావు మృతి చెందారు. హిమయత్‌నగర్‌లోని తన నివాసంలో గుండెపోటులో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గంలో రంగారావు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. వరంగల్ జిల్లా హన్మకొండ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.


