సీమాంధ్ర నేతల రాజీనామాలు సీఎం పన్నిన కుట్ర: కర్రె ప్రభాకర్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీమాంధ్ర నేతల రాజీనామాలు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పన్నిన కుట్రేనని కర్రె ప్రభాకర్‌ అన్నారు. ఇవాళ ఆయన సీమాంధ్ర  మంత్రుల రాజీనామాలపై మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర నేతలు ఇంకా ఉన్మాదంతో ప్రేట్రేగిపోతున్నారని ఆయన విమర్శించారు. నాయకులు రెచ్చగొట్టడంతోనే సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమం రెచ్చిపోతుందని ఆయన దుయ్యబట్టారు. ఇప్పటికైనా సీమాంధ్రులు ఉద్యమాన్ని ఉపశమింపజేయాలని ఆయన అన్నారు.