జయశంకర్ సార్‌కు నివాళులర్పించిన తెలంగాణ జేఏసీ టీ ఉద్యోగ సంఘాలు
హైదరాబాద్: తెలంగాణ జాతిపిత, తెలంగాణ ఉద్యమ సిద్ధాంత కర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పది జిల్లాలో జయశంకర్ సార్ విగ్రహాలకు, ఫోటోలకు పూలమాలలు వేసి పలువురు ప్రముఖులు, తెలంగాణవాదులు నివాళులర్పిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సార్ చేసిన సేవలను పలువురు కొనియాడారు. తెలంగాణ జేఏసీ, టీ ఉద్యోగ సంఘాల జేఏసీ, టీ పారిశ్రామికవేత్తల సంఘం, తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ ఇంజినీర్స్ అసోసియేషన్, విద్యుత్ ఇంజినీర్ల జేఏసీతో పాటు తదితర సంఘాలు జయశంకర్ జయంతి సభలను నిర్వహిస్తున్నాయి.