హైదరాబాద్‌ను అల్లకల్లోలం చేసేందుకు కుట్రలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణను అడ్డుకోవడంతో హైదరాబాద్‌లో విధ్వంసాలకు పాల్పడేందుకు సీమాంధ్ర మంత్రులు తెర లేపినట్లు సమాచారం. హైదరాబాద్‌ను అల్లకల్లోలం చేసేందుకు ఇద్దరు సీమాంధ్ర మంత్రులు ఏపీఎన్టీవోలతో కుట్రలు రచించినట్లు తెలుస్తుంది. తెలంగాణ ఉద్యోగులపై దాడులు చేయాలని ఆంధ్రా ఉద్యోగులపై దిశానిర్ధేశం చేసినట్లు సమాచారం. రోజుకో ప్రభుత& కార్యాలయాన్ని టార్గెట్‌ చేసేందుకు సీమాంధ్ర ఉద్యోగులు పన్నాగం పన్నినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జలసౌధ,బీమా భవన్‌లో తెలంగాణ ఉద్యోగులను సీమాంధ్ర ఉద్యోగులు రెచ్చగొట్టినట్లు సమాచారం.