సుప్రీంకోర్టులో మరోసారి లాలూకు ఎదురుదెబ్బ
నూఢిల్లీ,(జనంసాక్షి): ఆర్జేడి అధినేత లాలూప్రసాద్ యాదవ్‌కు సప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. బీహార్‌లో పశుదాణ కుంభకోణాన్ని విచారిస్తున్న ప్రత్యేక కోర్టు జడ్డిని బదిలీ చేయాలన్న ఆయన విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. విచారణను సాధ్యమైనంత త్వరగా ముగించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం నేతృత్వంలోని ధర్మాసం ఆదేశించింది. సీబీఐకు తన వాదనలను ముగించడానికి ఐదు రోజుల గడువును, నిందితులు తమ వాదనలు వినిపించేందుకు 15 రోజుల గడువు ఇచ్చింది. రాంచీ హైకోర్టు, సుప్రీంకోర్టు ఏం చెప్పాలన్న విషయంలో సంభంధం లేకుండా స్వతంత్రంగా తన తీర్పు వెలువరించాలని సుప్రీం ఆదేశించింది.