జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం
హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో 67వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగుర వేశారు. ఉప ముఖ్య మంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, పలువురు మంత్రులుఉన్నాతాధికారులు పాల్గొన్నారు.