తెలుగుజాతి గౌరవాన్ని కాపాడుకుందాం: డి.శ్రీనివాస్
హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్రాలుగా విడిపోయి ఒకే జాతిగా కలిసుందామని మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ సీమాంధ్రులకు పిలుపునిచ్చారు. తెలుగుజాతి గౌరవాన్ని కాపాడుకుందామని తెలిపారు. దేశంలోనే తెలుగువారు తెలివైన వారని గుర్తు చేశారు. ఇతర దేశాలు, రాష్ట్రల్లో తెలుగువారు ఉన్నత పదవుల్లో ఉన్నారని పేర్కొన్నారు. సీమాంధ్రుల కలిసి ఉండాలని సదుద్దేశంతోనే మాట్లాడాతున్నారు. కాని ఐదు దశాబ్దాల్లో ఏ ఒప్పందం అమలుకు నోచుకోకపోవడం వల్లే తెలంగాణ ఆక్షాంక్ష పుట్టుకొచ్చిందని తెలిపారు. 12 సంవత్సరాలుగా సంప్రదింపులుగా ప్రక్రియ జరిపిన తరువాతే విభజనకు కేంద్ర నాయకత్వం పూనుకుందని చెప్పారు. తెలుగు ప్రజల మధ్య ఉన్న ప్రేమాభిమానాలు 15 రోజులుగా తగ్గుతున్నాయని తెలిపారు. కృష్ణా, గోదావరి నదుల నీటి పంపకాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంతరాష్ట్ర నదీ జలాల పంపకాల సమస్యలుండవని తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ మొదలుపెట్టామని కాంగ్రెస్ పార్టీ యూపీఏ చెప్తున్నాయి. నిర్ణయం వెనక్కి తీసుకునే అవకాశం లేదని అర్థమవుతుంది. విభజన వల్ల సమస్యలు, ప్రయోజనాల గురించి ఆలోచించాలని హితవు పలికారు. సీమాంధ్ర ప్రాంతంలో కొత్తగా వచ్చే పోర్టులతో కలిపి 4 పోర్టులున్నాయని గుర్తు చేశారు. సీమాంధ్రలో ఉన్నవి నగరాలు తెలంగాణలో లేవని తెలిపారు. ఏకాభిప్రాయం తరువాతే అన్ని పార్టీలు తెలంగాణ ఇవ్వాలని చెప్పిన తర్వాతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ సాగుతుందని చెప్పారు.