పార్లమెంట్ ఆవరణలో నిరవధిక దీక్ష చేస్తాం
నారాయణ
హైదరాబాద్: పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద రేపటి నుంచి నిరవధిక దీక్ష చేయనున్నట్లు తేదేపా ఎంపీ కొనకళ్ల నారాయణ తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్టుభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సస్పెస్షన్ ఉత్తర్వులు తొలగించాలని స్పీకర్ స్పందిచలేదన్నారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మంత్రులు సమైక్యాంధ్ర కోసం పోరాడాలన్నారు. ఇన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న జగన్ ఎందుకు స్పందించలేదన్నారు. తెలంగాణలో తెలంగాణలో తెరాస విలీనం, సీమాంధ్రలో వైకాపాతో పొత్తు ఇదే కాంగ్రెస్ కుటిల నీతి అని విమర్శించారు.