సీబీఐ కోర్టుకు హాజరైన సబిత, ధర్మాన
హైదరాబాద్,(జనంసాక్షి): మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావులు సోమవారం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా కోర్టుకు హాజరై న్యాయమూర్తి ఎదుట తమ వాదనలు వినిపించారు. మరోపక్క అక్రమాస్తుల కేసులో జుడిషియల్ రిమాండ్ పూర్తికావడంతో నేడు మరోమారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీబీఐ న్యాయమూర్తి విచారణ చేపట్టనున్నారు.