క్షీణించిన రూపాయి విలువ

ముంబయి,(జనంసాక్షి): రూపాయికి మరోసారి డాలర్‌ దెబ్బ తగిలింది. సోమవారం ఆరంభ ట్రేడింగ్‌తో పోలిస్తే రూ. 64.20 క్షీణించింది. మాసాంతం కావడంతో బ్యాంకులు, వ్యాపారులు డాలర్‌ కొనుగోళ్లకు మొగ్గు చూపడం రూపాయి బలహీనతకు కారణమని వ్యాపార వర్గాలు తెలిపాయి. అదే విధంగా ముడి చమురు ధరలు కూడా పెరగడం ఇందుకు మరో కారణమని వారు విశ్లేషిస్తున్నారు.