రాష్ట్ర విభజన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర విభజనపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. రాష్ట్రాన్ని విభజించవద్దని కోరుతూ న్యాయవాది పీవీ కృష్ణయ్య సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే. విభజనపై కేంద్రం ఇంకా అధికారిక ప్రకటన చేయనందున పిటిషన్‌ విచారణర్హం కాదని కోర్టు తెలిపింది. ఆర్టికల్‌-3 ప్రకారం విభజించే అధికారం కేంద్రానికి లేదని కృష్ణయ్య వాదించారు. రాష్ట్రలను విభజించే అధికారం పార్లమెంట్‌కే ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.