విద్యుత్‌ సౌధ వద్ద టీజేఏసీ నాయకుల అరెస్ట్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): విద్యుత్‌ సౌధ దగ్గర ఎమ్మెల్యే నాగం జనార్ధన్‌రెడ్డి, టీజేఏసీ నాయకుడు అద్దంకి దయాకర్‌ను పోలీసులు అరెస్టు చేసి బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ ఉద్యోగులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన వీరిని బయటి వ్యక్తులకు ఇక్కడ ప్రవేశం లేదని పోలీసులు అరెస్ట్‌ చేశారు.