పెరిగిన పసిడి ధరలు

ముంబై,(జనంసాక్షి): పుత్తడి మళ్లీ కాంతులీనుతుంది. ఇవాళ పది బంగారం ధర రూ. 32,000 లకు చేరింది. రూపాయి క్షీణత, స్టాక్‌ మార్కెట్ల పతనం బంగారం ధరను  ఒక్కసారిగా పెంచేశాయి. దీంతో తొమ్మిది నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. రూపాయి పతనం బంగారాన్నే కాదు వెండి ధరకు కూడా రెక్కలొచ్చేలా చేసింది. రూ. 800 పెరిగే కేజీ వెండి ధర రూ. 54,800 పలికింది.