కోల్‌స్కాం దర్యాప్తు వేగవంతం చేయండి: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ మందకొండి దర్యాప్తుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 169 సంస్థలపై దర్యాప్తు వేగవంతం చేయాలని సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 4 నెలత్లో దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. బొగ్గు గనుల కేటాయింపు ఫైళ్ల గళ్లంతు అంశంపై కేంద్రాన్ని సుప్రీం తప్పు బట్టింది. ఫైళ్ల గల్లంతుపై కేసు ఎందుకు మోదు చేయలేదని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. బొగ్గు కుంభకోణంకు సంబంధించిన దర్యాప్తును ఐదు నెలల్లో పూర్తి చేస్తామని సీబీఐ సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చింది.