మెట్రో ఇండియా డైలీని ఆవిష్కరించిన సీఎం కిరణ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): మెట్రో ఇండియా డైలీని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో  బంజారాహిల్స్‌లోని పార్క్‌హయ్యత్‌ హోటల్‌లో జరిగింది. పత్రిక ఆవిష్కరణ కార్యక్రమానికి బీజేపీ సీనియర్‌నేత వెంకయ్యనాయుడు, టీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు, లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ, మంత్రి డీకే అరుణతో పాటు మెట్రో ఇండియా సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పత్రిక విజయవంతంగా ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు.