యువతిపై యాసిడ్ దాడి
హైదరాబాద్,(జనంసాక్షి): అనంతపురం జిల్లా ముదిగుబ్బలో ఒక యువతిపై యాసిడ్ దాడి జరిగింది. గాయపడిన ఆమెను అనంతపురం ఆస్పత్రికి తరలించారు. రాఘవ అనే వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. తనను ప్రేమించి మరో యువతిని పెళ్లి చేసుకోడంపై రాఘవను యువతి నిలదీయగా ఆగ్రహించిన రాఘవ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తుంది.