తెలంగాణ వాదం లేదన్నందుకే నినాదాలు చేశా: కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌

హైదరాబాద్‌: సీమాంధ్ర ఉద్యోగులు నిర్వహించిన సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ సభలో జైతెలంగాణ నినాదాలు చేసిన కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ ఆవేదన వ్యక్తం చేశారు.ఇవాళ ఆయనను పోలీస్‌ స్టేషన్‌ నుండి విడుదల చేసిన తరువాత సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్లో మాట్లాడారు.సీమాంధ్ర ఉద్యోగ నేతలు వేదికపై నుంచి తెలంగాణ తల్లిని అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసినందుకే తాను ఆవేశంతో జైతెలంగాణ నినాదాలు చేశానని, తెలంగాణ వాదం లేదంటున్న సీమాంధ్ర నేతల మాటలు తట్టుకోలేకపోయానని శ్రీనివాస్‌ అన్నారు.