ఓయూ జేఏసీ నేత బాలరాజ్‌ను పరామర్శించిన కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌ : ఏపీఎన్జీవోల సభ సందర్భంగా ఓయూ ఐకాస నేత బాలరాజుపై దాడిచేసిన వ్యక్తులను తక్షణం అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.నాంపల్లి కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలరాజును కిషన్‌రెడ్డి ,సీపీఎం నేత నోములనర్సింహాయ్య ఆదివారం వేరువేరుగా పరామర్శించారు.ఈ సంధర్బంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఏపీఎన్జీవోల సభలో వాస్తవాలను వక్రీకరించారని ,రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడారని కిషన్‌రెడ్డి విమర్శించారు.ఉద్యోగుల సభగా ఉండాలని హైకోర్టు చెప్పినప్పటికి తెలంగాణ వాదులను రెచ్చగొట్టేవిధంగా ప్రసంగాలు చేశారని ఆయన అన్నారు.