కర్ణాటక ప్రభుత్వోద్వోగులకు డ్రెన్‌కోడ్‌!

బెంగళూరు : ప్రభుత్వోద్యోగులకు డ్రెస్‌కోడ్‌ విధిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్త్రీలు చీరలు, సల్వార్‌ కమీజులు ధరించాలని, పురుషులు ఫార్మల్‌ ప్యాంట్‌ బ్లౌజులు, జీన్స్‌, టీషర్టులు లాంటి దుస్తులు కార్యాలయానికి ధరించడం సబబు కాదని, ఉద్యోగస్తులు హుందాగా కన్పించడం అవసరమని ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు. యువ ఉద్యోగస్తులు కాజువల్‌ దుస్తుల్లో ఆఫీసుకు రావడం ఇబ్బంది కరంగా ఉందని పలుమార్లు సీనియర్లు ఫిర్యాదుచేశారని, ఈ విషయలో తాము నచ్చజెప్పబోగా ఇలాంటి దుస్తులు ధరించకూడదని నియమం ఏమైనా ఉందా అని ఎదురు ప్రశ్నించారని అందుకే లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేయాల్సి వస్తోందని ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యమంత్రి అనుమతితో సెప్టెంబరు 12న డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ రిఫార్స్‌ అధికారి ఈ ఆదేశాలు విడుదల చేశారు. అప్పట్నించి ఉద్యోగవర్గాల్లో ఇది చర్చనీయాంశమైంది.