ఇంకెన్నాళ్లు ఈ కన్నీళ్లు :ఆడవారిపై ఆగని అత్యాచారాలు :తాజాగ మరో బాలికపై సామూహిక అత్యాచారం

హర్యానా : ఆడవారిపై దాడులను ,అత్యాచారాలను.,నేరాలను అదుపుచేయాలని పాలక ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చిన అవి నీటిమీది రాతలుగానే మిగిలిపోతున్నాయి.చట్టాలు నేరస్తులకు చుట్టాలుగా మారుతున్నాయి.ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిర్బయ హత్యాచార ఘటన అనంతరం ఆమె పేరు మీద నిర్భయ చట్టాన్ని స్త్రీలపై అత్యాచారాలు అఘాయిత్యాలను నివారించడానికి చేసిన చట్టాలు కార్యరూపం దాల్చడం లేదు. నేరాలను అదుపుచేయడంలో తీసుకున్న ఏ ప్రయత్నం సరిగా అమలుకు నోచుకోవడం లేదు. దేశంలో రోజు ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై ఏదో ఒక విధంగా దాడులు జరుగుతున్నాయి , తాజాగా హర్యానా రాష్ట్రంలోని జింద్‌ జిల్లాలోని కుర్దు గ్రామంలో ఓ 15ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది.బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.పోలీసుల కథనం ప్రకారం బాలికపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులు అని పోలీసులు గుర్తించారు. వారు నరేందర్‌ దల్షర్‌ ,పవన్‌ అనే వ్యక్తులుగా గుర్తించి వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు.