రాష్ట్ర విభజనపై కేబినెట్‌ కమిటీ నియామకం

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర విభజన ద్వారా సీమాంధ్రలో తలెత్తే అంశాలను పరిశీలించేందుకు పదిమంది మంత్రులతో కూడిన ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీలో సభ్యులుగా హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే , ఆర్ధిక మంత్రి చిదంబరం,కపిల్‌సిబల్‌, జ్యోతిరాధిత్య సింధియా, హరీష్‌ రావత్‌, కమల్‌నాథ్‌, పల్లంరాజు, ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌, నారాయణ స్వామి, మాంటెక్‌ సింగ్‌ నియమితులయ్యారు. ఈ కమిటీ ఆరు వారాల్లోగా కేంద్ర కేబినెట్‌కు నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఈ కమిటీని నియమించినా ఇదే అంశంపై పార్టీ పరంగా కాంగ్రెస్‌ పార్టీ నియమించిన ఆంటోని కమిటీ కూడా తన పని తాను చేసుకుపోనుంది.