మోగిన ఎన్నికల నగారా : ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల నగారా మోగింది. ఢిల్లీ, రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌ ,మిజోరంలలో సాధారణ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ మేరకు ఇవాళ అధికారులు ఒక ప్రకటటనలో నేర్కొన్నారు.ఈనెల 18న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఐదు రాష్ట్రాలలో ఎన్నికల నిర్వహణ కోసం లక్షా 30వేల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వారు పేర్కొన్నారు.ఐదు రాష్ట్రాలలో పదకొండు కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.ఛత్తీస్‌గడ్‌ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ నవంబర్‌ 11,19 తేదిల్లో ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో నవంబర్‌ 25న పోలింగ్‌ జరుగుతుందని తెలిపారు. ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయిన తర్వాత డిసెంబర్‌ 8న ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు.