7కేజీల వెండి అపహరణ

అనంతపురం: బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి ఏడు కేజీల వెండి అపహరణకు గురైన ఘటన పామిడి మండల రామరాజుపల్లెలో చోటుచేసుకుంది.ఆదిలాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి బస్సులో చెన్నై వెళ్తున్నాడు. రామరాజుపల్లె సమీపంలో ఉన్న రవితేజ హోటల్‌ వద్ద డ్రైవర్‌ బస్సును ఆపినప్పుడు టీ తాగేందుకు దిగాడు. అనంతరం బస్సు ఎక్కి చూసుకోగా సంచి అపహరణకు గురైనట్లు గుర్తించాడు. సంచిలో ఉన్న 7 కేజీల వెండి అపహరణకు గురైనట్లు బాధితుడు పామిడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.