ప్రయోగానికి సిద్ధమైన జీశాట్‌ -7

బెంగళూరు,(జనంసాక్షి): సముద్ర తీరప్రాంతాల పరిపక్షణకి వినియోగించేందుకు కేవలం రక్షణ శాఖ ఉపయోగానికి ఒక ప్రత్యేక ఉపగ్రహాన్ని భారత్‌ సిద్ధంచేసింది. జీశాట్‌-7 అనే ఈ శాటిలైట్‌ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందింది. ఫ్రెంచ్‌గయానాలోని కౌరో స్పేస్‌పోర్ట్‌ నుంచి శుక్రవారం దీనిని ప్రయోగించనున్నారు. దేశాన్ని దేశం చుట్టూ ఉన్న సముద్ర తీరాల్ని అంతరిక్షంనుంచి గస్తీ బాధ్యత చేపట్లే సామర్థ్యం ఈ శాటిలైట్‌ది.