సర్పంచ్ బరిలో 70 సంవత్సరాల వృద్ధురాలు
చెన్నారావుపేట, డిసెంబర్ 10 (జనం సాక్షి):
అమీనాబాద్ లో బరిలోకి
దిగిన బరిగెల కట్టమ్మ…
70 సంవత్సరాల వృద్ధురాలు సర్పంచ్ బరిలో నిలుచుంది. మండలంలోని అమీనాబాద్ గ్రామ సర్పంచ్ రిజర్వేషన్ ఎస్సీ జనరల్ కు కేటాయించారు. ఇదే గ్రామం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బరిగెల కట్టమ్మ 70 సంవత్సరాల వృద్ధురాలు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసింది. ఏ పార్టీలకు సంబంధం లేకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని గ్రామస్తులు ఆదరించి సర్పంచ్ గా గెలిపిస్తే ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటూ తన సేవలు అందిస్తానని ఇంటింటికి తిరుగుతూ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తుంది.


