విమానాశ్రయంలో 701 గ్రాముల బంగారం పట్టివేత

హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికువద్ద నుంచి అక్రమంగా తరలిస్తున్న 701 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం మస్కట్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేయగా అతని వద్ద బంగారం లభ్యమైంది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.