ధోని సేనకే అవసరం
ఆరో వన్డే మ్యాచ్ విజయంపై డోహర్తి వాఖ్య
నాగపూర్ అక్టోబర్ 28 (జనంసాక్షి) :
ఆరో వన్డే విజయంతోనే భారత్‌పై సిరీస్ విజయం సాధింస్తామని ఆస్ట్రేలియా లెఫ్టార్మ్ స్పిన్నర్ జేవియర్ డోహర్తి ధీమా వ్యక్తం చేశాడు. వన్డే సిరీస్ కోసం చివరి వన్డే దాకా ఎదురుచూడబోమన్నాడు. వర్షంతో రెండు మ్యాచ్‌లు రద్దవడంతో 7 వన్డేల టోర్నీ కాస్త ఇప్పుడు ఐదు వన్డేల సిరిస్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇందులో 2-1తో ఆధిక్యంలో ఉన్న ఆసిస్ ఇక్కడ బుధవారం జరిగే వన్డేలో గెలవాలనే పట్టుదలతో ఉంది. సోమవారం ప్రాక్టీస్ సెషన్ ముగాశాక డోహర్తి మాట్లా డుతూ ‘ఈ మ్యాచ్ గెలిచేందుకే ఇక్కడికొచ్చాం. బెంగళూర్ (చివరి మ్యాచ్ వేదిక) వన్డే దాకా భారత్‌కు అవకా శమివ్వం. ఆరో వన్డే మాకంటే ధోరి సేనకే కీలకం. చావోరేవో వారికే కాబట్టి… ఒత్తిడంతా భారత్‌పైనే ఉంది’ అని అన్నాడు.