ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిస్తా
ముంబై, అక్టోబర్ 28 (జనంసాక్షి) :
వచ్చే ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణంపై కన్నేసిన స్టార్ రెజ్లర్ యోగిశ్వర్‌్ దత్ ప్రస్తుతం ఫిట్‌నెస్‌కే అమిత ప్రాధాన్యమిస్తానని చెప్పాడు. ఈ నేపథ్యంలో 2014లో జరిగే కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్‌లో ఏదో ఒక టోర్నిలోనే పోటీ పడతానని చేప్పాడు. ఒక వేళ పూర్తిస్థాయి ఫిట్‌నెస్ ఉంటే ఈ మూడు ఈవెంట్లలోనూ పాల్లొంటానన్నాడు. ‘నాకు గాయాలే అతి పెద్ద సమస్యలు, చాలా సార్లు గాయాల బారిన పడ్డాను. కొన్నిసార్లు వెన్నునొప్పి… ఇంకొన్ని సార్లు మోకాలి గాయాలు.
కానీ ఆప్పుడు మాత్రం ఫిట్‌నెస్‌గానే ఉన్నా. ఇక ముందూ ఇలా ఉండటమే నా మొదటి లక్ష్యం’ అని 30 ఏళ్ల రెజ్లర్ అన్నాడు. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన యోగిశ్వర్ దత్ గాయం వల్ల గత నెల హంగేరిలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గోనలేక పోయాడు. అయితే వచ్చే ఏడాది ఈ మెగా ఈవెంట్‌లో దేశానికి పసిడి పతకం అందిస్తాననే ధీమా వ్యక్తం చేశాడు. ఇకపై తరచూ గాయాలపాలవకుండా కొన్ని ఎంచుకు న్న టోర్నీల్లోనే పాల్గొంటానన్నాడు. తద్వారా రియో ఒలింపిక్స్ (2016)లో స్వర్ణం గెలవా లనే కలను నెరవేర్చుకుంటానని చెప్పాడు.