నిర్ణీత కాలంలోగా ఉన్నతాధికారులను బదిలీ చేయొద్దు : సుప్రీంకోర్టు

న్యూఢీల్లీ : నిర్ణీత కాలంలోగా ఉన్నతాధికారులను బదిలీ చేయరాదన్న నిబంధనను అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అధికారుల బదిలీ, పదోన్నతులు , క్రమ శిక్షణ చర్యల విషయంలో కొత్త చట్టం తేవాలని ,3 నెలల్లోగా ఉత్తర్వులు జారీ చేయాలని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది., రాజకీయ జోక్యంతో అధికారుల పనితీరు క్షీణిస్తుందని ,నిర్ణీతకాలం వరకు అధికారులను బదిలీ చేయకుండా ఉంటే వారిలో పాలన సామర్ధ్యం పెరుగుతుందని న్యాయస్థానం వెల్లడించింది.