కేంద్రంలో ముదురుతున్న ‘చోగమ్‌’ వివాదం

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంలో చోగమ్‌ వివాదం ముదురుతుంది. కొలంబోలో15 నుంచి 17 వరకు జరిగే కామన్‌వెల్త్‌ దేశాధినేతల సమావేశానికి భారత్‌ తరపున ప్రధాని వెళ్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయన్న డీఎంకే అధినేత కరుణానిధి ఇదివరకే కేంద్ర ప్రభుత్వానికి వార్నింగ్‌ ఇచ్చాడు. శ్రీలంకలో తమిళుల ఊచకోత నేపథ్యంలో సమావేశాన్ని బహిష్కరించాలని తమిళనాడు అసెంబ్లీ తీర్మానించిన సంగతి తెలిసిందే. కరుణానిధితో మంత్రి చిదంబరం చర్చలు జరుపుతున్నారు. చోగమ్‌కు ప్రధాని హాజరుపై ఇంకా సందిగ్ధత వీడలేదు.