మొట్టమొదటి మహిళా బ్యాంక్‌ ప్రారంభం

మొంబయి: తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ సందర్భంగా ఈ రోజు మొట్ట మొదటి మహిళా బ్యాంక్‌ ప్రారంభించబడింది. ఇది దేశంలోనే మొట్ట మొదటి మహిళా బ్యాంక్‌. కాంగ్రెస్‌ అధినేత్రతి సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ బ్యాంకును ప్రారంభించారు. నేటి నుంచి దేశ వ్యాప్తంగా 7 మహిళా బ్యాంక్‌ శాఖలు పని చేయడం ప్రారంభిస్తున్నాయి. ఢిల్లీ, కోల్‌కతా, గౌహతి, ఇండోర్‌, చెన్ను, అహ్మదాబాద్‌, లక్నోలలో ఈ శాఖలు పని చేయనున్నాయి. వీటిలో అధిక శాతం సిబ్బంది మహిళలే. 2014 మార్చి 31 లోగా ఈ బ్యాంకుకు 25 శాఖలను ఏర్పాటుచేయనున్నారు.