మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం
వరంగల్ : జిల్లాలోని నెక్కొండలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. ముగ్గురు బాలురు అత్యాచారాన్ని వీడియోలో చిత్రీకరించి ఎంఎంఎస్ ద్వారా తమ స్నేహితులకు దృశ్యాలను పంపారు.విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు నెక్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.