భారత రత్నాలకు కర్ణాటక అసెంబ్లీ ప్రశంసలు
బెంగళూరు: ఇటీవల ప్రతిష్ఠాత్మక భారత రత్న అవార్డుకు ఎంపికైన శాస్త్రవేత్త సీఎస్‌ర్ రావు, క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండుల్కర్‌లకు కర్ణాటక విధాన పలు ప్రశంసల వర్షం కురిపించింది.ప్రపంచంలో 24 ఏళ్ల పాటు క్రికెట్‌లో కొనసాగిన ఏకైక క్రీడాకారుడు సచిన్ అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొనియాడారు. శస్త్రవేత్త సీఎస్‌ఆర్ రావు వల్ల దేశానికే కాక ఆయన సొంత రాష్ట్రమైన కర్ణాటకకు ప్రపంచంలో గుర్తింపు లభించిందన్నారు. ప్రతిపక్షనేతలు కుమార స్వామి, యడ్యూరప్ప తదితరులు కూడా సచిన్‌ని ప్రశంసించారు.


