లైంగిక వేధింపుల ఆరోపణల్లో న్యాయమూర్తి పేరు బహిర్గతం
న్యూఢిల్లీ: శిక్షనలో ఉన్న న్యాయవాది మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ న్యాయమూర్తి పేరును సుప్రీం కోర్టు నేడు బహిర్గతపర్చింది. ఆయన పేరు ఏకే గంగూలీ. ఆయన ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ తాను నిరపరాధినని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కమిటీకి ఆయన తన వాదన వినిపించారు. తన దగ్గర ఎంతో మంది శిక్షణలో ఉన్న న్యాయవాదులు పని చేశారని, వారందరినీ తాను తన బిడ్డల్లా చూసేవాడినని ఆయన చెప్పారు. న్యాయమూర్తుల కమిటీ ఈ రోజు తమ నివేదికను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివంకు సమర్పించింది.