రేపటి బంద్‌కు తెలంగాణ ఐకాస మద్దతు: కోదండరాం

న్యూఢిల్లీ: రేపటి బంద్‌కు తెలంగాణ ఐకాస మద్దతిస్తున్నట్లు తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో తెలంగాణ ఐకాస స్టీరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం కోదండరాం మాట్లాడుతూ…భవిష్యత్‌ కార్యాచరణపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పాటులో తేడా వస్తే తీవ్ర కార్యాచరణ ఉంటుందని కోదండరాం హెచ్చరించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు చెప్పారు. రాయల తెలంగాణను వ్యతిరేకిస్తున్నామని, ఎలాంటి ఆంక్షలు లేని సంపూర్ణ తెలంగాణను కోరుకుంటున్నట్లు చెప్పారు. రేపటి బంద్‌తోనైనా కేంద్రం తన వైఖరిని మార్చుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగ సంఘాల నేతలు దేవీ ప్రసాద్‌, శ్రీనివాస్‌ గైడ్‌, విఠల్‌, విద్యుత్‌ ఉద్యోగుల ఐకాస కన్వీనర్‌ రఘు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.