మిజోరంలో ఆధిక్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్
హైదరాబాద్: మిజోరం విధానసభ ఎన్నికల ఫలితాల లెక్కింపు కొనసాగుతోంది. ఆది నుండి ఇక్కడి ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతోంది. మధ్యాహ్నానికి కాంగ్రెస్ 17 స్థానాల్లో గెలిచి 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మిజో డెమొక్రటిక్ ఎలయన్స్ మూడు స్థానాలు గెలిచి రెండింట్లో ఆధిక్యంలో ఉంది. జోరం నేషల్ పార్టీ, ఇతరులు చెరో స్థానాన్ని గెలుచుకున్నారు.