ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది: లగడపాటి
ఢిల్లీ: ఐదు రాష్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తీవ్ర ప్రతికూల ఫలితాలు వచ్చాయని, ఈ ఫలితాలు యూసీఏ పనితీరును ప్రతిబింబిస్తున్నాయని ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. పార్లమెంట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ…సభకు ప్రభుత్వంపై విశ్వాసం ఉందో లేదో వేచి చూస్తున్నామన్నారు. సభ్యుల సంఖ్యా బలం అంశాన్ని పక్కన పెడితే…యూపీఏ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం దిగిపోయేందుకు ఇది సరైన సమయమని పేర్కొన్నారు.