శ్రీకాంత వడియార్ కన్నుమూత
బెంగళూరు : మైసూరు రాజకుటుంబానికి చెందిన శ్రీకాంత వడియార్ గుండెపోటుతో మంగళవారం కన్నుమూశారు. శ్రీకాంత వడియార్ పూర్తి పేరు మహారాజశ్రీ శ్రీకాంత దత్త నరసింహరాజ వడియార్ బహదూర్. మైసూర్ సంస్థానానికి చివరి రాజైన మహారాజ జయచమరాజేంద్ర వడియార్ కుమారుడైన శ్రీకాంత 1953లో జన్మించారు. వడియార్ రాజవంశానికి పెద్ద అయిన శ్రీకాంత మైసూర్ లోక్ సభ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ , భాజపా తరఫున ప్రాతినిధ్యం వహించారు. మైసూర్ విశ్వవిద్యాలయం క్రికెట్ జట్టుకు శ్రీకాంత సారథిగా వ్యవహరించారు.