స్వలింగ సంపర్కం వ్యక్తిగత స్వేచ్ఛ : రాహుల్‌


న్యూఢిల్లీ, డిసెంబర్‌ 12 (జనంసాక్షి) :

స్వలింగ సంపర్కం వ్యక్తిగత స్వేచ్ఛ అని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. స్వలింగ సంపర్కం అనైతికమంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై రాహుల్‌గాంధీ స్పందించారు. వయోజనులైన వ్యక్తులు ఇష్టం మేరకు కలిసి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. స్వలింగ సంపర్కం నేరమన్న సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు చిదంబరం, కపిల్‌ సిబల్‌ తదితరులు కూడా తీర్పుపట్ల తమ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ కానీ క్యురేటివ్‌ పిటిషన్‌ కారీ వేయాలని భావిస్తున్నట్లు సమాచారం. తన అసంతృప్తిని వ్యక్తంచేస్తూ సోనియా ఈ రోజు ఒక ప్రకటన విడుదల చేశారు. పార్లమెంటు ఈ విషయంపై చర్చిస్తుందని ఆమె అశాభావం వ్యక్తం చేశారు.