కేరళలో నిలిచిపోయిన శబరి ఎక్స్‌ప్రెస్
కేరళ: కేరళలోని సోలూరు కూడలి వద్ద శబరి ఎక్స్‌ప్రెస్ రైలు గంటకు పైగా నిలిచిపోయింది. ఎన్-10 బోగీలో ప్రయాణిస్తున్న గుంటూరు జిల్లా అయ్యప్ప భక్తులకు, కేరళ భక్తులకు మధ్య ఘర్షణ జరగగా ఇద్దరు గుంటూరు జిల్లా అయ్యప్ప భక్తులను కేరళ పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. వారిని విడుదల చేయాలంటూ భక్తులు రైలును నిలిపివేసి ఆందోళన చేస్తున్నట్లు తెలుస్తోంది.