కాంగ్రెస్ ఎంపీల తీరు గోడ మీద పిల్లుల్లా ఉంది: పనబాక
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో అవిశ్వాసానికి నోటీసులిచ్చిన కాంగ్రెస్ ఎంపీల తీరు గోడ మీద పిల్లుల్లా ఉందని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ఆరోపించారు. ప్రకాశం జిల్లాలో జరిగిన పలు కార్యక్రమాలకు హాజరైన మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు అందరూ ఆమోదం తెలపడంతోనే సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఇప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో చొక్కాలు చింపుకుంటున్నారని అన్నారు. ఈ విషయంలో మా పార్టీ ఎంపీల తీరు గోడ మీద పిల్లుల్లా ఉందని ఎద్దేవా చేశారు.