బిల్లును ప్రవేశపెట్టడం సంతోషంగా ఉంది: జానారెడ్డి

హైదరాబాద్‌: శవాసభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడం సంతోషంగా ఉందని మంత్రి జానారెడ్డి అన్నారు. జానారెడ్డి ఛాంబర్‌లో తెలంగాణ ప్రాంత మంత్రుల సమావేశం ముగిసింది. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద జానారెడ్డి మాట్లాడుతూ… బిల్లుపై సభలో వెంటనే చర్చ చేపట్టాలని, అవసరమైతే సమావేశాలు పొడిగించాలని కోరారు. వెంటనే బీసీఏ సమావేశం నిర్వహించాలని విఙ్ఞప్తి చేశారు. తెలంగగాణ రాష్ట్రం తప్పక ఏర్పడుతుందని ప్రజలు విశ్వసిస్తుందన్నారు. శాసనసభ ఆవరణలో గందరగోళం సృష్టించడం సరికాదన్నారు. విభజన ప్రక్రియ ఆలస్యమైతే ఇరు ప్రాంతాల్లో భావోద్వేగాలు, ఆందోళనలు పెరిగే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు పరీక్షలకు కూడా అంతరాయం కలగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. దిగ్విజయ్‌సింగ్‌ డబ్బు మూటలు తెచ్చారని చంద్రబాబు నాయుడు ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.